ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను కూర్చోపెట్టడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. తాజాగా రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌లో ఆటోలో 23 మంది చిన్నారులను కూర్చోబెట్టి స్కూల్‌కు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటోను ట్రాఫిక్ ఎస్సై కల్యాణ్ సీజ్ చేశారు. ఆ తర్వాత చిన్నారులను మరో రెండు వాహనాలలో ఇంటికి పంపించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. అలాగే చిన్న పొరపాటు జరిగినా పిల్లల ప్రాణాలకు ప్రమాదమేనని తల్లిదండ్రులకు సూచించారు.