హైదరాబాద్: టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఫుట్‌బోర్డ్‌పై నుంచి పడి గాయపడిన 17 ఏళ్ల యువతి చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. నవంబర్ 1వ తేదీన అవంతి కాలేజీలో చదువుతున్న బాలిక రద్దీగా ఉన్న బస్సు ఫుట్‌బోర్డ్‌పై నుంచి పడిపోయింది. కిందపడిన తర్వాత ఆమెపై నుంచి బస్సు వెనుక చక్రం వెళ్లింది. దీంతో ఆమెకు అనేక గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ఆమె నాలుగు వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ప్రాణాలు నిలవలేదు. శస్త్రచికిత్స అనంతర ఇన్ఫెక్షన్ల కారణంగా మరణించింది.
మరోవైపు ప్రమాదానికి టీఎస్‌ఆర్‌టీసీ కార్పొరేషన్ బాధ్యత వహించడాన్ని నిరసిస్తూ అవంతి కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తగినన్ని బస్సు సర్వీసులు అందించడంలో కార్పొరేషన్ వైఫల్యం చెందడం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు.
చివరిసారిగా 2015లో టిఎస్‌ఆర్‌టిసి కొత్త బస్సులను కొనుగోలు చేసింది
టీఎన్‌ఐఈలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. తెలంగాణ ఆర్టీసీ చివరిసారిగా 2015లో కొత్త బస్సులను కొనుగోలు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకం కింద బస్సులను కొనుగోలు చేశారు.అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 700 బస్సులను సర్వీసు కోసం ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ యోచిస్తోంది. 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న పాత బస్సుల స్థానంలో ఈ బస్సులు రానున్నాయి.