రెడ్ అలెర్ట్.. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..!
157 Corona Cases Reported In Telangana. తెలంగాణ లో మరో 157 కరోనా కేసులు నమోదయ్యాయి.
By Medi Samrat
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయ. ఓ వైపు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నా.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 25,320 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇక తెలంగాణ లో మరో 157 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 35 మంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్‌కు మరొకరు బలయ్యారు. కొత్తగా 166 మంది బాధితులు కొవిడ్ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి 983 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 718 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. భారత్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే 26,291 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయింది. బాధితుల సంఖ్య కోటీ 13 లక్షల 85 వేలు దాటింది. మహమ్మారికి ధాటికి మరో 118మంది బలయ్యారు.
ఆదివారం మరో 17,455 మంది వైరస్ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,99,08,038 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు చెప్పింది.2021, మార్చి 14 వరకు మొత్తం.. 22,74,07,413 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 7,03,772 నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది.