పోలీసు పతకాలు.. తెలంగాణకు 14
1380 Police personnel awarded medals, announces MHA.ఆగస్టు 15.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని
By తోట వంశీ కుమార్ Published on 14 Aug 2021 9:00 AM GMTఆగస్టు 15.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ.. సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలను ప్రకటిస్తూ ఆ జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు ప్రకటించగా, 628 మంది గ్యాలంటరీ పోలీసు పతకాలు ప్రకటించారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి.
తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సెఫ్టీ వింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి.
గ్యాలంటరీ పోలీసు పతకాలు వరించిన తెలంగాణ పోలీసులు వీరే..
- పీకే ఎస్ రమేశ్ ( AAC )
- ఎన్ లాల్యా ( SC )
- ఎం పాపారావు ( JC )
- ఎం భాస్కర రావు ( JC )
- జీ ప్రతాప్ సింగ్ ( JC )
- కే వెంకన్న ( JC )
- మాలోతు రాములు ( JC )
- బీ మరియా దాస్ ( Dy.AC )
- కే పరుశురామ్ నాయక్ ( SC )
- అబ్దుల్ అజీం ( JC )
- కే తిరుపతయ్య ( SC )
- పీ సత్యనారాయణ ( JC )
- వీ రమేశ్ ( JC )
- గుర్రం కృష్ణప్రసాద్ ( SI )
ఉత్తమ సేవా పోలీసు పతకాలు దక్కింది వీరికే..
- వీ శివకుమార్ ( డీఐజీ ఇంటెలిజెన్స్, లక్డీకాపూల్ )
- మేఘావత్ వెంకటేశ్వర్లు ( అడిషనల్ ఎస్పీ, మాదాపూర్ జోన్ )
- రమేశ్ దండుగుడు ( అడిషనల్ ఎస్పీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, బేగంపేట )
- జితేందర్ రెడ్డి ( ఏఎస్సీ, హన్మకొండ )
- చంద్రశేఖర్ ఆకుల ( ఏఎస్సీ, ట్రాఫిక్ మాదాపూర్ డివిజన్ )
- పిట్చయ్య మువ్వ ( డీఎస్పీ, పోలీసు ట్రైనింగ్ సెంటర్ కాలేజీ, అంబర్ పేట )
- సంపత్ కుమార్ రెడ్డి ( అసిస్టెంట్ కమాండంట్, 1ST బెటాలియన్ టీఎస్ఎస్పీ యూసుఫ్‌గూడ )
- ఆనంద్ కుమార్ ( ఏఎస్ఐ, హైదరాబాద్ )
- చంద్రశేఖర్ రావు ( ఏఎస్ఐ (IT&C), టీఎస్ పోలీసు అకాడమీ )
- ఆరిఫ్ అలీ మహ్మద్ ( సీనియర్ కమాండో, పుప్పాలగూడ పోస్ట్ )
- అనిల్ గౌడ్ ( హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్ పీఎస్ కాచిగూడ )