తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్

10-day lockdown imposed in Telangana state from May 12. తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

By Medi Samrat
Published on : 11 May 2021 3:06 PM IST

lockdown in Telangana

తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టి నుంచి ప‌దిరోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది. ఈ ప‌దిరోజుల్లో ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్‌డౌన్‌ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. ఈ స‌మ‌యంలో నిత్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు వెసులుబాటు క‌ల్పించారు.

ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు కానుంది. ఈ స‌మ‌యంలో దాదాపు అన్ని కార్య‌క‌లాపాలు నిలిచిపోనున్నాయి. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. ఈ మేర‌కు మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న భైటీ అయిన‌ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. అయితే లాక్‌డౌన్ నుండి వేటికి మిన‌హాయింపు ఉంటుందో ప్ర‌భుత్వం నుండి మార్గ‌ద‌ర్శ‌కాలు రావాల్సివుంది. ఇదిలావుంటే.. రేప‌టినుండి లాక్‌డౌన్ అని రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మందుబాబులు వైన్స్ షాపుల‌ ముందు క్యూ క‌ట్టారు.



Next Story