తెలంగాణ: కీలక నిర్ణయం.. విద్యార్థులు ఎక్కడుంటే అక్కడే పది పరీక్షలు
By సుభాష్ Published on 6 Jun 2020 11:11 AM ISTతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులు వారు నివాసం ఉన్న ప్రాంతంలోనే పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టింది. హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులకు కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ. సత్యనారాయణరెడ్డి అన్నారు. కాగా, సమయం తక్కువగా ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల హాల్ టికెట్ల వివరాలు, నివసిస్తున్న ప్రాంతం, పరీక్ష రాయాలనుకుంటున్న సెంటర్లు, జిల్లా, మండలాల వివరాలు సంబంధిత డీఈవోలకు ఈనెల 7వ తేదీలోగా తెలియజేయాలని స్పష్టం చేశారు. (ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు)
దీంతో విద్యార్థులకు ఆయా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థుల వివరాలను జిల్లా డీఈవో కార్యాలయాల్లో నేరుగా గానీ, ఫోన్ నెంబర్ ద్వారా గానీ, లేదంటే జిల్లా ప్రత్యేకంగా పదో తరగతి విద్యార్థల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కేంద్రాల ద్వారా ఇవ్వవచ్చని తెలిపారు. కరోనా వైరస్ వల్ల పట్టణాల్లోని హాస్టళ్లు కొన్ని తెరవలేదని, తెరిచిన ఆయా పాఠశాలలకు వచ్చి హాస్టళ్లలో ఉండి పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులు తాము ఉంటున్న నివాస ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ఇవి చదవండి:
♦ తెలంగాణ ఆర్టీఏ కీలక నిర్ణయం.. ఇక ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే సేవలు
♦ టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్ కుమార్
♦ దేశంలోనే రెండో స్థానం: తెలంగాణలో 55 రకాల కరోనా వైరస్‌లు: జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా