ముఖ్యాంశాలు

  • సరుకు రవాణా సేవలో ఆర్టీసీ
  • ర్టీసీ నష్టాలను పూడ్చేందుకే ఈ ప్లాన్‌
  • స్సులను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 2020, జనవరి 1 నుంచి సరుకు రవాణా రంగంలో సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు రవాణా రంగంలోకి దిగాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్‌ పరిధిలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన ఆర్టీసీ బస్సులను సరుకు రవాణా బస్సులుగా మార్చాలని సర్కార్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే దీనిపై ప్రభుత్వ అధికారులు అధ్యయనం కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్లు ఎలాంటి సరుకులను, ఏ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు? కిలో మీటర్‌కు ఎంత చొప్పున ఛార్జ్ చేస్తున్నారు తదితర అంశాలపై డిపో మేనేజర్లు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.

ఒక్కో బస్సు 7 టన్నుల సరుకు రవాణా చేసే సామర్థ్యం:

ఒక్కో బస్సు దాదాపు 7 టన్నుల సరుకును రవాణా చేసే సామర్థ్యంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 'తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసు' అనే పేరును వినియోగిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ పేరును మార్చాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. సరుకు రవాణా బస్సులకు పూర్తిగా ఎరుపు రంగు ఉండగా, వాహనం వెనుక వైపు కొంతమేర క్రీమ్‌ కలర్‌ ఉంటుంది. అలాగే బస్సు డ్రైవర్లకు, సిబ్బందికి డ్రెస్‌ కోడ్‌ అమలు చేయనున్నారు.

కొత్త రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా పని చేసేలా చర్యలు చేపడుతుంది. ప్రైవేటు ఆపరేటర్లకంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రైవేటు ఆపరేటర్లకంటే వేంగంగా పని చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారట. ఏకంగా ప్రభుత్వమే ఈ రంగంలోకి దిగుతుండటంతో ఈ ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆర్టీసీ లాభాల దిశగా అడుగులు వేస్తున్న ఆర్టీసీ.. ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాలి.

Cargo Bus

నష్టాలను పూడ్చేందుకే ..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దాదాపు 50 రోజులపాటు బస్సులన్నీ రోడ్లపైకి రాలేకపోయాయి. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో కొన్ని బస్సులను మాత్రమే నడపగలిగింది ఆర్టీసీ. సమ్మె కాలంలో కూడా ఆర్టీసీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ముందే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కార్మికుల సమ్మెతో మరింత నష్టాల్లోకి నెట్టినట్లయింది. ఇటు నష్టాలను చవిచూస్తూ, అటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువైపోయింది. సమ్మె కాలంలో కూడా కార్మికులకు జీతాలను చెల్లించింది. నష్టాల బాటలో ఆర్టీసీని ఎలాగైన లాభాల బాటలో తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తోంది తెలంగాణ ఆర్టీసీ.

సుభాష్

.

Next Story