ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..!

By అంజి  Published on  30 Nov 2019 3:22 AM GMT
ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..!

ముఖ్యాంశాలు

  • మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు
  • ఫిబ్రవరి 1 నుంచి 20వరకు ప్రాక్టికల్స్‌: ఇంటర్ బోర్డు కార్యదర్శి

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్ విద్యార్థుల వార్షిక పరీక్షల షెడ్యూల్ రిలీజ్‌ అయ్యింది. మార్చి 4 నుంచి 23 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరగనున్నాయి. కాగా ఫస్టియర్‌ విద్యార్థులకు మాmsర్చి 4 నుంచి 21 వరకు, సెంకడీయర్ విద్యార్థులకు మార్చి 5 నుంచి 23 వరకు పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం కంటే ఈసారి వారం రోజులు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 20వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలను, జనవరి 30న ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్ నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్‌ ప్రకటించింది. 9 లక్షల 50 వేల మంది ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్‌ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. మరోవైపు ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ఆన్‌స్క్రీన్‌పై ప్రయోగాత్మకంగా నిర్వహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో కూడా ఒకే టైమ్ టేబుల్ ఉండేలా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.



Next Story