ఏసీబీ వలకు చిక్కిన మరో అవినీతి చేప..!
By అంజిPublished on : 12 Dec 2019 4:44 PM IST

సంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీకి పట్టుబడింది. రామచంద్రపురం మండలం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వో వెంకటయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గోల్కొండకు చెందిన జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి వెలిమేల గ్రామపరిధిలోని సర్వే నం.361, 364 రికార్డు కావాలని అడగగా.. వీఆర్వో వెంకటయ్య రూ.6 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.2 వేలు వీఆర్వోకు ఇచ్చిన బాధితుడు హుస్సేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా వీఆర్వో వెంకటయ్యకు ఇవాళ మరో రూ.2 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Next Story