ఈనెల 11న గజ్వేల్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 11వ తేదీన గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11 గంటలకు ములుగులో నిర్మించిన తెలంగాణ ఫారెస్టు కాలేజీ, హార్టికల్చర్‌ యూనివర్సిటీలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే 11న సాయంత్రం 5 గంటలకు కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్రమంత్రి వర్గసమావేశం జరగనుంది.

Gajwel 2

కాగా, తమిళనాడులోని మెట్టుపాలయంలో అక్కడి ప్రభుత్వం ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేసింది. దీని ఫలితంగా అక్కడి నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు ఐఎఫ్ఎస్ అధికారులుగా ఎంపికయ్యే అవకాశం దక్కింది. దీనిని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ విద్యార్థులను కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తొలిసారిగా 2016లో తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ను ఏర్పాటు చేసింది. ములుగులో విశాలమైన ప్రాంగణంలో ఈ భవన సముదాయం నిర్మించారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉద్యానవాల అభివృద్ధి, పరిశోధన కోసం ప్రభుత్వం ములుగులో హర్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది.

Gajwel1

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్