హైదరాబాద్‌ లోని నాంపల్లి ట్రాఫిక్‌ హోంగార్డుపై ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. బైక్‌పై వెళ్తున్న ఆ యువకుడు హెల్మెట్‌ పెట్టుకోకపోవడంతో హోంగార్డు ఫోటో తీశాడు. అంతే కోపంతో ఊగిపోయిన యువకుడు ఎందుకు ఫోటో తీసావంటూ హోం గార్డ్ పై దాడికి దిగాడు. హెల్మెట్‌ పెట్టుకోకపోవడంతోనే ఫోటో తీశానని చెప్పినా వినకుండా తీవ్ర రాద్దాంతం చేశాడు ఆ యుకుడు. ఇతర ప్రయాణికులు ఎంత సముదాయించినా కోపంతో ఊగిపోయాడు.  దీంతో రోడ్డుపై తీవ్ర గందరగోళం నెలకొంది. యువకుడి హంగామాతో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. యువకున్ని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. హోగార్డు నాంపల్లి పోలీసుస్టేషన్‌లో యువకుడిపై ఫిర్యాదు చేశాడు.  నిందితుడు పరారీలో ఉన్నాడు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.