తెలంగాణలో కోట్ల ఏళ్లనాటి శిలాజాలు లభ్యం..!

By Newsmeter.Network  Published on  1 Dec 2019 11:03 AM GMT
తెలంగాణలో కోట్ల ఏళ్లనాటి శిలాజాలు లభ్యం..!

ముఖ్యాంశాలు

  • 12 కోట్ల ఏళ్ల నాటి శిలాజాలు లభ్యం
  • చేపలు, వృకాలు, జంతువుల,ఆకుల పాద ముద్రల శిలాజాలు
  • శిలాజాల అన్వేషణలో కొత్త తెలంగాణ చరిత్ర

కోట్ల సంవత్సరాల నాటి చేపలు, వృక్షాలు, జంతులువు, ఆకులకు సంబంధించిన పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు బయటపడం అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తోంది. కాగా, శిలాజంగా మారిన చేప ఆకృతికి సంబంధించిన ఆధారాలు తెలంగాణలోని రామగుండం ఎన్టీపీసీ పరిధిలో లభ్యమయ్యాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రాక్షస బల్లులు కూడా జీవించాయనడానికి సాక్ష్యంగా గతంలో వాటి శిలాజాలు లభ్యమయ్యాయి. బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని డైనోసారియంలో ఉన్న రాక్షసబల్లి ఆకృతి శిలాజాల రూపం ఇక్కడ లభించినదేనని చెబుతున్నారు. ఇప్పటికీ పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో రకరకాల శిలాజాలు లభ్యమవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ శిలాజాలు లభించాయి. పరిశోధకుడు సముద్రాల సునీల్‌ తాజాగా వీటిని సేకరించారు. చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో కొన్ని ఆకుల ఆకృతులతో కూడిన శిలాజాలు లభ్యమయ్యాయి. ఇవి ప్రాచీన కాలానికి చెందిన వృక్షజాతి గ్లోసోప్టెరీస్‌కు చెందినవిగా నిష్ణాతులు చెబుతున్నట్లుగా వాటిని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. ఈ జాతి చెట్లలో నారవేప, తిరుమణి తదితరాలు ఉంటాయని, ఈ పత్ర శిలాజాల వయసు దాదాపుగా 12 కోట్ల ఏళ్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే మంచిర్యాల జైపూర్‌ ప్రాంతంలో ఒక జంతువు పాద ముద్ర నిక్షిప్తమైన శిలాజాన్ని కూడా గుర్తించారు.

12 Crore Years

సేకరించిన పత్రశిలాజాల ముద్రలు చాలా విలువైనవని, అవిఏ వృక్షజాతులకు చెందినవో పరిశీలన కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ పత్ర శిలాజాలు ప్రాచీన వృక్షజాతికి చెందినవని అభిప్రాయపడుతున్నారు. ఈ జాతి చెట్లలో నారవేప, తిరుమణి మొదలైనవి ఉంటాయి, వాటి ఆకులు కూడా ఈ పత్ర శిలాజాల అచ్చులని పోలివుంటాయంటున్నారు. సునీల్‌ సేకరించిన పత్ర శిలాజాల ఇంప్రెషన్స్‌ 10 కోట్ల సంవత్సరాలకు ముందు నాటివని చెబుతున్నారు. సునీలత్ పత్ర శిలాజాలనే కాదు, కొన్ని జంతువుల ఆస్థి శిలాజాలను కూడా సేకరించారు. మంచిర్యాల జైపూర్‌ ప్రాంతం నుంచి ఒక జంతువు పాదముద్రల అచ్చు శిలాజాన్ని, ఆ ప్రాంతం నుంచే వందలాది ఎకరాలలో విస్తరించిన వృక్ష శిలాజాలను గుర్తించారు. కాగా, ఇవన్నీ ఒక ఎత్తైతే... రామగుండం ఎన్టీపీసీ ఏరియాలో సేకరించిన చేప అచ్చు శిలాజం ఒక ఒత్తని పరిశోధకులు పేర్కొంటున్నారు. 12 కోట్ల నుంచి ఆరున్నర కోట్ల సంవత్సరాల మధ్య కాలానికి చెందిన ఈ శిలాజాల అంశాలు తెలంగాణ చరిత్రకు కొత్తపుటలుగా అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ పురాచరిత్ర ఎంత ప్రాచీనమైనదో చెప్పడానికి లభిస్తున్న నిదర్శనాలన్నారు.

Telangana News

అలాగే ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి శివారులో అతి పెద్ద కొయ్య శిలాజం పరిశోధనలో బయటపడింది.. ఇటీవల పురావస్తు, చారిత్రాత్మక స్థలాల అన్వేషణలో భాగంగా కూకట్లపల్లి పరిసరాలను పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి, చారిత్రక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి పరిశీలించారు. ఈ రంగంలో నిపుణులైన తెలంగాణా చరిత్ర బృంద సభ్యులు రామోజు హరగోపాల్‌ ఈ శిలాజాన్ని క్రీ.పూ. 6 కోట్ల సంవత్సరాలకు చెందినదిగా చెబుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యత గల శిలాజం ఇంత పెద్ద పరిమాణంలో లభించడంతో ప్రకాశం జిల్లా చరిత్ర ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. శ్రీఆంజనేయస్వామి దేవాలయం వద్ద నాలుగు అడుగుల పొడవు, అడుగు వెడల్పు, ఆరు అంగులాల మందం గల కొయ్య శిలాజాన్ని గుర్తించినట్లు వారు చెప్పారు. గతంలో ఈ పరిసరాలలో మధ్య రాతి యుగం, కొత్త ఇనుప రాతి యుగపు ఆనవాళ్లను వారు గుర్తించారు. కాగా,ఆంజనేయస్వామి దేవస్థాన పునాదులు తవ్వుతుండగా ఈ శిలాజం బయల్పడిన సంగతి తెలుసుకొని పరిశీలించామని పేర్కొన్నారు.

Telangana News

Next Story