తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఈగో ఫైట్‌..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 7:01 AM GMT
తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఈగో ఫైట్‌..!!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. పూర్తిస్థాయి కేబినెట్‌ కొలువుదీరింది. అన్ని శాఖలకు మంత్రులు వచ్చారు. అయితే మంత్రులు మాత్రం తమ నియోజకవర్గాలు దాటడం లేదు. కొన్ని జిల్లాలకు మాత్రమే వెళుతున్నారు. తమ జిల్లాలోని పక్క నియోజకవర్గాలకు కూడా వెళ్లడం లేదు. దీంతో ఈ మంత్రులకు ఏమైంది అనే చర్చ తెలంగాణ భవన్‌లో నడుస్తోంది.

మొన్నీమధ్య పాలమూరు మంత్రి...పక్కనే ఉన్న నియోజకవర్గానికి వెళ్లారట. నియోజకవర్గ కార్యక్రమాలకు వరుస పెట్టి హాజరు అయ్యారట. అంతే మంత్రి రాకను జీర్ణించుకోని ఆ ఎమ్మెల్యే తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారట. తన కోపాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు గన్‌మెన్లను వెనక్కికి పంపించారట. అంతేకాకుండా పార్టీ నేతలకు అందుబాటులోకి రాకుండా అలకపాన్పు ఎక్కారట. దీంతో ఆ జిల్లా మంత్రి అటు వైపు వెళ్లడం మానేశారని తెలుస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన మంత్రుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి తన కొడుకు,అల్లుడు భవిష్యత్ కోసం సిటీ లోని నియోజకవర్గల్లో జోరుగా టూర్లు వేస్తున్నారు. దీంతో లోకల్‌ ఎమ్మెల్యేలు మంత్రిగారి పర్యటనలకు బ్రేక్‌లు వేశారట. దీంతో ఆ మంత్రి కూడా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆయన కూడా తన సర్కిల్‌ దాటడం లేదట.

సికింద్రాబాద్ మంత్రిగా పేరుపొందిన నేత కూడా వేరే జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. కానీ సిటీలో మాత్రం వేరే నియోజకవర్గాలపై పెద్దగా చూడడం లేదు. మాజీ మంత్రి, మేయర్‌తో వచ్చిన గ్యాప్‌ వల్లే ఆయన సిటీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ మంత్రి పరిస్థితి కూడా అలానే ఉంది..తన జిల్లా తన నియోజకవర్గం తప్ప ఎటూ వెళ్లడంలేదంటా. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మినహా మిగతా మంత్రులు ఎవ్వరు కూడా వేరే జిల్లాలో అడుగుపెట్టాడానికి సాహసం చెయ్యడం లేదట.

సాధారణంగా అయితే మంత్రి హోదాలో రాష్ట్రం లో ఎక్కడ అయిన పర్యటించే అధికారలు మంత్రులకు ఉంటాయి. కానీ ఎమ్మెల్యేల నుండి సహకారం లేకపోవడం..తాము టూర్లతో వారు అసంతృప్తికి గురికావడంతో మనకు వచ్చిన తంటా ఎందుకులే అని కొందరు మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారట.

Next Story