ఉపాధ్యాయుల బోధనా విధానం పై అసహనం... మంత్రి హరీష్ రావు

By Newsmeter.Network  Published on  28 Dec 2019 4:56 PM IST
ఉపాధ్యాయుల బోధనా విధానం పై అసహనం... మంత్రి హరీష్ రావు

మంత్రి హరీష్ రావు సంగారెడ్డి కందిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవతరగతి విద్యార్థులను వివిధ ప్రశ్నలను అడిగారు. అదేవిధంగా పిల్లలతో తెలుగులో పేర్లు వ్రాపించారు. ఎక్కాలను కూడా అడిగారు విద్యార్థులు తగిన ప్రతిభ చూపించ లేకపోయేసరికి ఉపాధ్యాయుల బోధనా విధానం పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలంటే ఉపాద్యాయులదే కీలక పాత్ర అని విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా తీర్చిద్దిదాలని అన్నారు.

అదేవిధంగా కంది శివారులో నూతనంగా నిర్మస్తున్న టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ పనులను ఆయన పరిశీలించారు. భవనాన్ని మంచిగా నిర్మించాలని కాంట్రాక్టర్ కు సూచనలు ఇచ్చారు. మంత్రి హరీష్ రావు ఇటీవల వెళ్లిన అల్లాపూర్ లోని గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు తమ ప్రతిభను చూపించని విషయం తెలిసిందే దీంతో ఉపాధ్యాయుల పని తీరు పై ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు.

Next Story