తెలంగాణ హైకోర్టుకు కరోనా ఎఫెక్ట్‌.. రేపటి నుంచి మూసివేత

By సుభాష్  Published on  8 July 2020 2:38 PM IST
తెలంగాణ హైకోర్టుకు కరోనా ఎఫెక్ట్‌.. రేపటి నుంచి మూసివేత

తెలంగాణలో కరోనా వైరస్‌కు అంతే లేకుండా పోతోంది. రోజురోజుకు కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతిరోజు 1500లకుపైగా కేసులు నమోదు కావడంతో మరింత కలవరపెడుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు నమోదువుతన్న కేసుల్లో దాదాపు 90 శాతం వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివి కావడం తో నగర ప్రజలను మరింత భయాందోళన కలిగిస్తోంది. ప్రజలనే కాకుండా పోలీసులు, ప్రభుత్వ అధికారులను ఇలా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు కరోనా. చివరికి ప్రగతి భవన్‌ సిబ్బందికి కూడా కరోనా సోకిందంటే పరిస్థిలా ఎలాం ఉందో అర్థమైపోతోంది. తాజాగా కరోనా మహమ్మారి తెలంగాణ హైకోర్టుకు చేరింది. కోర్టులో పని చేసే ఉద్యోగులకు కరోనా సోకడంతో గురువారం నుంచి హైకోర్టును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే కోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో హైకోర్టును పూర్తిగా శానిటైజ్‌ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. హైకోర్టులోని ఫైల్స్‌ అన్నింటిని జ్యూడీషియల్‌ అకాడమీకి తరలించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమైన కేసులను విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేసే కేసుల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉండటంతో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలను కలవరపెడుతోంది. కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ 27,612 కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 313కు చేరింది. ఇక రాష్ట్రంలో 11వేలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉండగా, 16,287 మంది ఆస్పత్రుల్లో కోలుకును డిశ్చార్జ్‌ అయ్యారు.

Next Story