దేశ ప్రజలపై నిఘాకు కేంద్రానికి తెలంగాణ సాయం
By Kumar Sambhav Shrivastava Published on 19 March 2020 2:59 AM GMTహైదరాబాద్: హఫ్ పోస్ట్ ఇండియా కొన్ని డాక్యుమెంట్లను రివ్యూ చేయగా.. మోదీ ప్రభుత్వం అనుకుంటున్న డేటా బేస్ కు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందట..! ఆధార్ డేటా మీద ఆధార పడకుండా 1.2 బిలియన్ల మంది ప్రజలకు సంబంధించిన డేటా బేస్ రూపకల్పనకు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందని హఫ్ పోస్ట్ ఇండియా తెలిపింది.
అక్టోబర్ 19, 2018న జయేష్ రంజన్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సమానహోదా కలిగిన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సెక్రెటరీ గా పనిచేస్తున్న అజయ్ ప్రకాష్ సాహ్నేకు పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర అప్పటికే అలాంటి సిస్టమ్ ఒకటి ఉందని.. తాము రాష్ట్రంలోని 30మిలియన్ల మందికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పెట్టామని.. కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి సహాయం చేస్తామని.. అప్పుడు ఆ సిస్టం ద్వారా 1.2 బిలియన్ల మంది సమాచారాన్ని సేకరించి వారిపై నిఘా ఉంచవచ్చనని తెలిపారట.
తెలంగాణ ఆఫర్ ఈ విషయంలో కేవలం మూడంటే మూడు వారాలు మాత్రమే చలనంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆధార్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణ లోకి తీసుకుని ఆధార్ అవసరం లేకుండా మోదీ ప్రభుత్వం కోరుకున్న డేటా బేస్ ను తయారుచేద్దామని రంజన్ ఈమెయిల్ పంపారు. హఫ్ పోస్ట్ ఇండియా ఈ ఈమెయిల్ కాపీని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సంపాదించింది. తెలంగాణలో 'సమగ్రం' అనే ప్రాజెక్టును రెండున్నర సంవత్సరాల కిందటే ప్రవేశపెట్టింది. స్మార్ట్ గవర్నెన్స్ ప్లాట్ ఫామ్ లో భాగంగా ఎటువంటి యూనిక్ ఐడీల అవసరమే లేకుండా పెద్ద డేటా సెట్స్ ను రికార్డు స్థాయిలో లింక్ చేశారు.
తెలంగాణ సిస్టమ్ కు సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. కొందరు సీనియర్ అధికారులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎప్పుడు కావాలనుకున్నా డేటాను యాక్సెస్ చేసి.. ఒక్కో వ్యక్తికి సంబంధించిన డేటాను పరిశీలించవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన డేటాను ఉపయోగించి కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించవచ్చును. తెలంగాణ డేటా బేస్ గురించి ఇంతకు ముందే రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. రంజన్ రాసిన ఈమెయిల్ ఈ విధంగా ఉంది "ఇతర రాష్ట్రాలకు, భారత ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖలకు కూడా మేము సరైన పరిష్కారం చూపుతాము.. తాము ఢిల్లీకి వచ్చి ఒక ప్రెజెంటేషన్ చూపిస్తాము".
తెలంగాణ అప్లికేషన్ అయిన సమగ్రం మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని భావిస్తున్న వివాదాస్పద సోషల్ రిజిస్ట్రీకి ప్రాథమిక రూపం లాంటిది. హఫ్ పోస్ట్ ఇండియా రిపోర్ట్ ప్రకారం నేషనల్ సోషల్ రిజిస్ట్రీ ఒక్కో పౌరుడికి సంబంధించిన విషయాలన్నింటినీ నిఘా వేసింది. ఊర్లు మారినా, ఉద్యోగాలు మారినా, కొత్త ప్రాపర్టీ కొన్నా, కుటుంబంలో ఎవరైనా పుట్టినా, చనిపోయినా, పెళ్లి జరిగినా, అత్తవారింటికి వచ్చినా అన్నీ రికార్డులో ఎక్కించబడుతున్నాయి. అలాగే ఆధార్ నంబర్ల కారణంగా మతం, కులం, ఆదాయం, ఆస్తులు, చదువు, పెళ్ళి అయ్యిందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, ఏమైనా అంగవైకల్యం ఉందా, వంశ వృక్షానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం డేటా బేస్ లో పొందుపరచడమే.
2011లో రూపొందించిన సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్(ఎస్.ఇ.సి.సి.) ద్వారా సోషల్ రిజిస్ట్రీని రూపొందించగా.. సమగ్రం సిస్టమ్ ను సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించారు. 2014 లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టింది. ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసింది.
తెలంగాణకు చెందిన సమగ్రం డేటాబేస్ రాష్ట్రానికి చెందిన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ డేటాబేస్ ను రూపొందించడానికి ముఖ్య కారణం ప్రభుత్వ ఫలాలు అందరికీ అందడానికే అని అధికారులు తెలిపారు.
యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ఎకనామిక్ అడ్వైజర్ మనోరంజన్ కుమార్ సోషల్ రిజిస్ట్రీ రూపకర్తల్లో ఒకరు కాగా.. ఆయన హఫ్ పోస్ట్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ డేటాబేస్ మొత్తం ఇతరుల చేతిలో చేరి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ రిజిస్ట్రీని అమలు చేయడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నానని.. ఇప్పుడు అమలుపరచడం ద్వారా పౌరులకు సంబంధించిన డేటా అన్నది ఇతరులకు చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు. మొదట ప్రభుత్వానికి చెందిన డేటా సెక్యూరిటీని పటిష్టం చేయాలని, కోర్టులను కూడా బలపరచాలని.. అప్పుడే ఇటువంటి వాటిని అమలుపరిచే వీలు ఉంటుందని అన్నారు. అదే కానీ జరగకపోతే అంత పెద్ద డేటాను కేంద్రం దుర్వినియోగపరిచే అవకాశం ఉందని ఆయన అన్నారు.
గోప్యత పాటించడం కష్టమేనా..!
హైదరాబాద్ లోని ఓ పెద్ద పోష్ ఏరియా లోని రెండస్థుల బిల్డింగ్ లో తన ఆఫీసులో ఓ సీనియర్ అధికారి నగరానికి చెందిన ప్రముఖ క్రీడాకారుల పేర్లను టైపు చేశాడు. కొన్ని సెకెండ్ల లోనే ఆ పేర్లకు సంబంధించిన 12 మంది వ్యక్తుల రికార్డులు మానిటర్ పై ప్రత్యక్షమయ్యాయి. ఆ రికార్డుల్లో అడ్రెస్, ఫోన్ నంబర్, హై స్కూల్, హయ్యర్ సెకండరీ ఎగ్జామ్ డీటెయిల్స్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, అతడి వాహనానికి సంబంధించిన మొత్తం సమాచారం బయటకు వచ్చింది. వాళ్లంతా డబ్బులు ఉన్నవాళ్లు, ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళే అని నవ్వుతూ ఆ అధికారి సమాచారం గురించి చెప్పుకొచ్చాడు. తాము ఒక నెట్వర్క్ ను బిల్డింగ్ చేయాలని అనుకుంటూ ఉన్నామని.. వాటిలో పలువురికి సంబంధించిన సమాచారం ఉంది. తమకు ఫోన్ నంబర్ ఇస్తే చాలు మొత్తం సమాచారాన్ని మీ ముందు ఉంచుతామని అన్నారు.
ఇంకో రెండు క్లిక్ లు ఇచ్చాడు.. వెంటనే కుటుంబానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సదరు క్రీడాకారులకు సంబంధించిన తోబుట్టువుల సమాచారం కూడా బయటపడింది. ఆ క్రీడాకారుడికి సంబంధించిన తోబుట్టువుల సమాచారం ప్రభుత్వానికి ఇవ్వకున్నా.. వారి దగ్గర ఉన్న నెట్ వర్క్ ఆధారంగా రిలేషన్ షిప్స్ మొత్తం బయటపడ్డాయి. హఫ్ పోస్ట్ ఇండియా ఆ క్రీడాకారుడికి సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టాలని అనుకోలేదు.
సమగ్రం సిస్టమ్ అధికారి హఫ్ పోస్ట్ ఇండియాతో మాట్లాడుతూ ఈ డేటా ద్వారా తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. ఒకే అడ్రెస్ లో నివసిస్తూ ఉన్నా, ఒకటే ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలను వాడినా అట్టే తెలుసుకోవచ్చు. ఒక్కో వ్యక్తికి సంబంధించిన సమాచారంపై క్లిక్ చేసే కొద్దీ.. చివరి అంచు వరకూ వెళ్లొచ్చని ఆయన అన్నారు. సమగ్రం అప్లికేషన్ కు సంబంధించి రిలేషన్ షిప్- నెట్వర్క్ ఫీచర్ అన్నది లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలలోని సీనియర్ అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందట.
ఇలాంటిది దేశ చరిత్రలోనే మొదటిది.. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల పరిధిలో ఉన్న పవర్ ను బట్టి ఏమైనా చేయొచ్చు అని ఆ అధికారి తెలిపారు. అలాంటి సమయంలో వారి దగ్గర ఉండాల్సింది కేవలం పేరు, అడ్రెస్ మాత్రమేనని అన్నారు. దేశంలోని పలు ప్రముఖ లా-ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఇలాంటి డేటాబేస్ లనే రూపొందించాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇటువంటి నెట్ వర్క్ ను రూపొందించడానికి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంట్, NATGRID కూడా ప్రయత్నించాయి. వారు చేస్తున్న ప్రయత్నాలు పలు దశల్లో ఉన్నాయి. కానీ ఎవరూ ఈ స్థాయికి చేరలేదని సమగ్రంలో పనిచేసే అధికారి తెలిపారు.
NATGRID లేదా నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అన్నది కౌంటర్-టెర్రర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ను రూపొందించాలని భావిస్తోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
తెలంగాణ రాష్ట్ర అధికారులు మాత్రం తమ ట్రాకింగ్, మ్యాచింగ్ సిస్టమ్ చాలా ఖచ్చితమైన సమాచారం ఇస్తుందని చెబుతున్నారు. జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క వ్యవస్థ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కావాలని కోరుకుంటుందని.. ఎవరైనా ఏదైనా ట్రాన్సాక్షన్ అన్నది చేస్తే.. రికార్డును మెయింటైన్ చేయాలని కోరుకుంటామని ఆయన ప్రజల సమక్షంలో 2019 జులై నెలలో వ్యాఖ్యానించారు. హఫ్ పోస్ట్ ఇండియా ఆ వీడియోను రివ్యూ చేయగా.. 'మీరు ఒక వ్యక్తి పేరును చెబితే.. ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం డిజిటల్ సమాచారాన్ని ఇస్తానని.. 96 శాతం కరెక్టుగా ఉండే అవాకాశం ఉందని' అన్నారు.
ఎవరి సమ్మతం అవసరం లేదా
తెలంగాణ సమగ్రం లేదా సమగ్ర వేదిక డేటా బేస్ అన్నది ఆల్గారిధమ్ ను ఉపయోగించి తయారుచేశారు. మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించి ఒక్కో వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవచ్చు. ఆల్గారిధమ్ లు ఎప్పటికప్పుడు స్వతహాగా కరెక్ట్ చేసుకుంటూ ఖచ్చితత్వం అన్నది ఉండేలా చూస్తుంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని 30 రకాల ప్రభుత్వ డేటా బేస్ లను ఉపయోగించి తయారు చేశారు. ఒక్కో పౌరుడికి సంబంధించిన డిజిటల్ ప్రొఫైల్ ను డేటాబేస్ లో పొందుపర్చవచ్చు.
'ఉదాహరణకు.. ఇప్పుడు ఒక బ్యాంకు అకౌంట్ ను ఓపెన్ చేస్తామని అనుకో... బ్యాంకు డేటాబేస్ మిమ్మల్ని రికార్డు చేస్తుంది. ఇప్పుడు మీరో మొబైల్ ఫోన్ కొన్నా, సిమ్ కార్డు కొన్నా ఆపరేటర్ డేటాబేస్ మీకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ ఉంటుంది. ఓటర్ లిస్టులో ఉన్నా మీ డేటా రికార్డు చేయబడుతుంది. ప్రాపర్టీ టాక్స్ ను కడుతున్నా ప్రాపర్టీ టాక్స్ లిస్టులో మీ సమాచారం ఉంటుంది. జీఎస్టీ అన్నది కడితే.. అది జీఎస్టీ డేటా బేస్ లో ఉంటుంది' అని రంజన్ పబ్లిక్ లోనే చెప్పేసారు. వివిధ రకాల డేటా బేస్ లను ఉపయోగించి డిజిటల్ ప్రొఫైల్ ను రూపొందిస్తూ ఉంటారు. సమగ్రం వ్యవస్థ అన్నది ఒక్కొక్కరికి సంబంధించిన డిజిటల్ ప్రొఫైల్ ను రూపొందిస్తూ ఉంటుంది. పేరు, అడ్రస్ లను ఉపయోగించి ఆ ప్రొఫైల్ ను రూపొందిస్తారు. ఫోన్ నంబర్లు లాంటి అదనపు సమాచారం ఇవ్వడం ద్వారా డేటా అన్నది మరింత ఖచ్చితత్వాన్ని పొందే అవకాశం ఉందన్నారు. పాలన అన్నది పారదర్శకంగా జరపడానికి ఈ డేటా బేస్ అన్నది అవసరమని.. ఇలా నిఘా పెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం అదేనని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు తెలిపారు.
ఆదాయానికి సంబంధించిన సరైన సమాచారం ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి సరిగా పన్నులు చెల్లిస్తారని, ట్రేడ్ లైసెన్స్ ఫీ, ప్రాపర్టీ టాక్స్, వాహన రిజిస్ట్రేషన్స్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని.. ఇలాంటి డేటా ఉంటేనే పన్నులు వసూలు చేయడానికి వీలవుతుందని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమీషనర్ జి.టి.వెంకటేశ్వర రావు హఫ్ పోస్టు ఇండియాకు ఇచ్చిన ఈమెయిల్ లో తెలిపారు. చాలా మంది పెద్ద పెద్ద కార్లు ఉన్నా, వ్యాపారాలు, భవనాలు, పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలను ఆర్జించాలని భావిస్తూ ఉంటారు.. ఆర్జిస్తూనే ఉన్నారు కూడానూ..!
నిజంగా అర్హులైన వారికి అభివృద్ధి ఫలాలు అందాలి అంటే సమగ్ర వేదికను అమలుపరచాలని.. అలాంటప్పుడే పాలన అన్నది సక్రమంగా జరుగుతుందని వెంకటేశ్వర రావు అభిప్రాయ పడ్డారు. ఈ వ్యవస్థలో ఆధార్ కార్డు అన్నది.. అసలు ఉపయోగించరని.. సెప్టెంబర్ 2019లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకు ఎటువంటి వ్యతిరేకం కాదని అన్నారు. అంతేకాకుండా 2017 లో సుప్రీం కోర్టు ఇచ్చిన రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ ను కూడా తాము పరిగణలోకి తీసుకున్నామని అన్నారు. ఈ డేటాకు సంబంధించి ప్రజల సమ్మతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన కొత్త సమాచారాన్ని తాము తీసుకోవడం లేదని.. కేవలం ఇతర డిపార్ట్మెంట్ లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే తాము డేటా బేస్ లో పొందుపరిచారని ఆయన అన్నారు. అందులో ఉన్నది చాలా తక్కువ డేటా అని.. అది కూడా వివిధ వ్యవస్థల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారమేనని రావు తెలిపారు. కేవలం రికార్డులను ఒక్కో డేటా బేస్ నుండి మరొక డేటా బేస్ కు కలపడం మాత్రమేనని.. ప్రభుత్వ సహాయం కోరినప్పుడు ఇటువంటి డేటా బేస్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వ్యవస్థ చాలా పటిష్టమైనదని.. కేవలం సీనియర్ ప్రభుత్వాధికారులు మాత్రమే దీన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉందని అన్నారు. చాలా విషయాలపై తాము జాగ్రత్తలు తీసుకున్నామని.. ఎవరు పడితే వారు యాక్సెస్ చేయడానికి కుదరదని రావు తెలిపారు.
సమగ్రం వ్యవస్థ గురించి రావు చెప్పిన విషయాలు నమ్మదగినవిగా లేవని ప్రైవసీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ గవర్నెన్స్ అసోసియేట్ డైరెక్టర్ స్మితా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇలా డేటాను ఒక చోట ఉంచడం ద్వారా ప్రజల సమాచారం ఈజీగా చేతులు మారే వకాశం ఉందని.. ప్రభుత్వం దేనికోసమైతే డేటాను సేకరించిందో.. అందుకు తగ్గట్టుగా పనిచేయాలని.. సుప్రీం కోర్టు సూచనలను పాటిస్తూ ప్రతి ఒక్కరి విషయంలో గోప్యత పాటించడమే ముఖ్యమైన అంశమని అన్నారు. రైట్ టు ప్రైవసీ అన్నదానిపై కఠినమైన చట్టాలు ఉండాలని అన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవ్వడానికి ముఖ్య కారణం.. పౌరులకు సంబంధించిన డేటా అన్నది ఇతరుల చెంతకు చేరకూడదని.. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ డేటాను తీసుకుని ఏదైనా చేసే అవకాశం ఉందని ప్రసాద్ హెచ్చరించారు. అంత మొత్తంలో డేటా అన్నది లా అండ్ ఆర్డర్ వ్యవస్థ చేతిలో ఉండకూడదని అన్నారు. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అన్నది ఈ డేటాను ప్రతి సారి నిర్దిష్టమైన అవసరం కోసమే ఉపయోగిస్తుందని ఏమి గ్యారెంటీ అని.. ఎవరైనా దీన్ని యాక్సెస్ చేసి వేరే అవసరాలకు వాడే అవకాశం ఉందని ఆమె అభిప్రాయ పడ్డారు.
పౌరులకు సంబంధించిన 360 డిగ్రీల సమాచారాన్ని వివిధ వ్యవస్థల ద్వారా సేకరించి సేకరించి ఒక చోట పెట్టడం వలన ఎక్కడో ఒకచోట దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో డేటా ప్రొటెక్షన్ కు సంబంధించి కఠినమైన చట్టాలు కూడా లేవని నాన్-ప్రాఫిట్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ గుప్తా చెప్పారు. ప్రస్తుత కాలంలో వ్యక్తిగత డేటా అన్నది చాలా సులువుగా అమ్మేస్తూ ఉన్నారని.. ప్రస్తుతం చిన్న మొత్తంలో డేటా అన్నది బయటకు వెళుతోందని.. రాబోయే కాలంలో అది తీవ్ర రూపం దాల్చొచ్చని.. అది చాలా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.