గుడ్‌న్యూస్: తెలంగాణలో కొత్తగా 2 పాజిటివ్ కేసులు
By సుభాష్ Published on 27 April 2020 3:25 PM GMT
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ విజృంభించిన కరోనా మహమ్మారి గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది. తాజాగా సోమవారం కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1003కు చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకుని 16 మంది బాధితులను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సోమవారం కొత్తగా నమోదైన ఆ రెండు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమేనని పేర్కొంది. ఇప్పటి వరకూ కరోనాతో 25 మంది మృతి చెందారు.
త రెండు, మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేవుడా కరోనా తగ్గిపోని అంటూ వేడుకుంటున్నారు. కరోనా త్వరగా తగ్గిపోతే లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశాలుంటాయి. దీంతో ప్రజలు ఎవరికి వారు పనులు చేసుకోవచ్చు.
ఇక కరోనా నివారణ చర్యలపై కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ తదితర అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. మే 7వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.