నేడే తెలంగాణ బడ్జెట్.. అందరిలోనూ ఉత్కంఠ
The Telangana government will present the budget in the assembly today. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తెలంగాణ సర్కార్ నేడు
By అంజి Published on 6 Feb 2023 3:56 AM GMT2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తెలంగాణ సర్కార్ నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆర్థికమంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అదే టైంలో శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. రేపు అసెంబ్లీకి సెలవు కాగా.. ఎల్లుండి బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుండగా అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పనున్నారు. 9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది.
ఈనెల 12న ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. కాగా తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లుగా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మంత్రి హరీష్ రావు.. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీని చేరుకుని బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు. మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో బడ్జెట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రతి సంవత్సరం మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది ముందస్తుకు వెళ్లే వ్యూహాంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
బడ్జెట్‌లో వచ్చే ఎన్నికల కోసం ఓట్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించబోతోందని ప్రచారం నడుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయింపు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగ భృతి, దళితబంధు, గిరిజనబంధుకు స్పెషల్ ఫండ్స్ కేటాయిస్తారని తెలుస్తోంది. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న బీఆర్‌ఎస్.. ఇప్పుడు దీనికి నిధులు కేటాయించి అమలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది.