తెలంగాణ బడ్జెట్‌ 2024-25లో కేటాయింపులు ఇవే..

తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

By Srikanth Gundamalla  Published on  10 Feb 2024 3:02 PM IST
telangana, budget 2024-25, congress govt,

తెలంగాణ బడ్జెట్‌ 2024-25లో కేటాయింపులు ఇవే..

తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈమేరకు బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,75,891 కోట్ల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. కాగా.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉంది.

ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో పెద్దపీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేదని విమర్శలు చేశారు భట్టి విక్రమార్క. అంతేకాదు.. గత పాలకుల నిర్వాకంతోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలైందని చెప్పారు. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులను అధిగమించి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క చెప్పారు.

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు:

* ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.53,196 కోట్లు కేటాయింపు

* పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు

* వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు

* నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు కేటాయింపు

* ఐటీశాఖకు రూ.774 కోట్లు కేటాయింపు

* విద్యా రంగానికి రూ.21,383 కోట్లు కేటాయింపు

* వైద్య రంగానికి రూ.11,500 కోట్లు

* ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు

* బీసీ సంక్షేమ శాఖకు రూ.8000 వేల కోట్లు

* ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.13,313 కోట్లు

* మైనార్టీ సంక్షేమ శాఖకు 2,262 కోట్లు

* పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు కేటాయింపు

* గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు కేటాయింపు

* మూసీ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయింపు

Next Story