తెలంగాణ బడ్జెట్ 2023: ఏ రంగానికి ఎంత కేటాయించారంటే?
Telangana Budget 2023: How much has been allocated for which sector?. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
By అంజి Published on 6 Feb 2023 11:09 AM ISTతెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకుని రాష్ట్రం నిలబడిందన్నారు. సంక్షోభ సమయాల్లో సరైన ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందిందన్నారు. రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు.
బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయించారు. వ్యవసాయానికి రూ. 26,831 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు. విద్యుత్‌కు రూ. 12,727 కోట్లు కేటాయించారు. సంక్షేమానికి కూడా తెలంగాణ సర్కార్ తన చివరి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు, దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు, గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు కేటాయించారు. విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం కేటాయించారు. విద్య రంగానికి రూ. 19,093 కోట్లు, వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు కేటాయించారు.
అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు, ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు, అటవీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు, పంచాయతీ రాజ్‌కు రూ. 31,426 కోట్లు, హరితహారం పథకానికి రూ. 1471 కోట్లు కేటాయించారు. రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయించగా.. పురపాలక శాఖకు రూ. 11,372 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు, హోంశాఖకు రూ. 9,599 కోట్లు , పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు కేటాయించారు. రైతుబందు పథకానికి రూ. 1575 కోట్లు, రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లను తెలంగాణ సర్కార్ కేటాయించింది.
తాజా వార్షిక బడ్జెట్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12,000 కోట్లు, ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు, ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లను తెలంగాణ సర్కార్ కేటాయించింది.