తెలంగాణ 2020 బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకుంటారు. కాగా, జాతీయ జనాభా పట్టిక చేపట్టబోమని గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేసే అవకాశాలున్నాయి. పల్లెప్రగతి, పట్టణప్రగతి, కరోనా వైరస్‌ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా, తెలంగాణలో సమర్ధమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది.

ఇక 2019-20 బడ్జెట్‌ లక్షా 46 వేల 492 కోట్లు ఉండగా, రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల 55 కోట్లు ఉంది. మూలవ్యయం రూ. 17వేల, 274.67 కోట్లుగా చూపింది. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలతో ముందుకు సాగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం ఏఏ అంశాలను ప్రాధాన్య అంశాలుగా తీసుకోనుందో సభలో తెలియజేయాల్సి ఉంది

గత బడ్జెట్‌లో..

గత బడ్జెట్‌లో రైతు బంధు పథకానికి రూ.12వేల కోట్లు, పంట రుణమాఫీకి రూ. 6 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. రూ. 2వేల 714 కోట్లు కేటాయించింది. ఇక మున్సిపాలిటీలకు రూ. 1వేల 764 కోట్లు, ఆరోగ్యశ్రీకి ఏడాదికి గాను రూ.  1వేల336 కోట్లు, రైతుబీమా ప్రీమియం చెల్లించేందుకు రూ.1వేల 137 కోట్లు, అలాగే ఆసరా పింఛన్లు రూ.9వేల 402 కోట్లు కేటాయించింది. మరి ఈ బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని ఏమైనా పెంచుతారా లేదా అన్నది ఈ బడ్జెట్‌లో తేలనుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.