తెలంగాణ బంద్: ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 4:44 AM GMT
తెలంగాణ బంద్: ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు

హైదరాబాద్ : తమ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవాలంటూ 15 రోజులుగా తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు అంటే అక్టోబర్ 19 న తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చారు. బంద్ కు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దత్తు పలుకుతున్నాయి. అయితే...ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. బంద్ నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో పలు డిపోల నుంచి బస్సులు కదల్లేదు.

కుషాయిగూడ, జీడిమెట్ల బస్ డిపోల వద్ద ఆర్టీసి కార్మికులు భారీగా తరలివచ్చారు. పోలీసు బలగాలు కూడా మోహరించడంతో ఇప్పడి వరకు ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. జీడీమెట్ల డిపో పరిధిలో ఆగిపోయిన 149 బస్ లు. రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల నిరసన ఉద్రిక్తంగా మారింది. డిపో నుండి AP11Z 4899 నంబర్ గల సికింద్రాబాద్ టూ టోలిచౌక్ వెళ్లే బస్సు డ్రైవర్ ను సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు కొట్టడంతో బస్సును తిరిగి వెనక్కి తీసుకెళ్లారు .రోడ్డు పై బైఠాయించిన ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

మియపూర్, గచ్చిబౌలి లలో పలు పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్ సుఖ్ నగర్ బస్ డిపో వద్దకి వచ్చిన 8మంది ఆర్టీసి ఉద్యోగులను మలక్‌ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్టీసీ ఉద్యోగులను అడ్డుకున్నారు. సికింద్రాబాద్ లో ని రాణి గంజ్, జూబ్లీ, కంటోన్మెంట్, పికెట్, రెతి ఫైల్, 31 బస్టాండ్ , చిలకలగూడ బస్ స్టాప్ లో నే బస్ లు నిలిచి పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సందర్భంగా ఖమ్మం డిపో ముందు ధర్నా కి దిగిన ఆర్టీసీ కార్మికులకు సీపీఐ, సీపీఎం,సీపీఐ (ఎంఎల్ ), కాంగ్రెస్ పార్టీలు మద్దత్తు తెలిపాయి. సిద్దిపేటలో బంద్ ప్రశాంతం జరుగుతుంది. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికుల పిలుపు మేరకు బందులో భాగంగా ఓయూలో విద్యార్ధి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. విద్యార్ధులు భారీ సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. కోదండరామ్ సహా పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు.

TSRTC Strike:Telangana State Wide Shutdown Live Updates - Sakshi

బస్ లు నిలిచిపోవడంతో ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. బంద్ ప్రభావం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం లోపు బస్ లు పోలీస్ ల భద్రత నడుమ నడుస్తాయని , దీనికి ఆర్ టి సి ఉన్నతాధికారులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

Next Story