వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్‌ హాస్టల్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రిలీవింగ్‌ ఆర్డర్‌ కోసం ప్రిన్సిపల్‌ సతీష్‌ కుమారి ఓ విద్యార్థిని నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రిన్సిపల్‌తో పాటు శోభారాణి, శారద అనే ట్యూటర్లు కూడా డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది.

రాష్ట్రంలో ఎవరైన లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఒక వైపు ప్రభుత్వం హెచ్చరిస్తుంటే.. మరో వైపు లంచాలు తీసుకోవడం ఏ మాత్రం ఆగడం లేదు. దేశంలో లంచాలు అధికం కావడంతో ఏసీబీ అధికారులు గట్టి నిఘా పెంచి దాడులు నిర్వహిస్తున్నారు. అయినా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలా ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అధికారులు ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు సరిపోక లంచాలకు కక్కుర్తి పడి పూర్తిగా దిగజారుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.