హైద‌రాబాద్‌లో 4 కిలోల బంగారం ప‌ట్టివేత..!

By Newsmeter.Network  Published on  24 Nov 2019 5:39 AM GMT
హైద‌రాబాద్‌లో 4 కిలోల బంగారం ప‌ట్టివేత..!

హైద‌రాబాద్‌లో భారీగా బంగారం, న‌గ‌దు దొరికింది. డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘాలో ఈ బంగారం ప‌ట్టుబ‌డింది. సికింద్రాబాద్‌ ఈస్ట్ మారేడ్ పల్లిలోని షెనాయ్ హాస్పిటల్స్ ద‌గ్గ‌ర‌లో ఉన్న ఓ ఇంట్లో 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘావ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు ఇంటిపై దాడులు చేస్తే భారీగా బంగారం ప‌ట్టుబడింది.

Whatsapp Image 2019 11 23 At 8.01.35 Pm

ఇంటి పార్కింగ్ ప్లేస్‌లోని కారులో బంగారం బ్యాగును అధికారులు గుర్తించారు. బ్యాగుని తెరిచి చూస్తే 40 బంగారు బిస్కెట్లు కనిపించాయి. వీటి బరువు 4 కిలోలుగా అధికారులు లెక్క తేల్చారు. బంగారంతో పాటు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం అమ్మకాలకు సంబంధించిన పత్రాలని, నగదుని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వీటి విలువ రూ.4 కోట్లని డిఆర్ఐ

అధికారులు ప్రకటించారు.

Whatsapp Image 2019 11 23 At 8.01.31 Pm

కాలికట్ నుండి ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఇతర దేశాలనుండి దొంగతనంగా బంగారం తెచ్చానని ముగ్గురు నిందితులు అంగీకరించార‌ని డిఆర్ఐ అధికారులు వివరించారు. ఈ ముగ్గురే ముఠాలో ఉన్నారా? లేక వీరికి ఎవరెవరు స‌హ‌క‌రించారనే కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు.

Next Story