భారతదేశపు మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం (అక్టోబర్ 4, 2019) ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. 110 కిలోమీటర్ల వేగంతో పనిచేసే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ పూర్తిగా ఐఆర్సిటిసి ఆధీనంలో నడుస్తుంది. ఈ ట్రైన్ శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

తేజస్ ట్రైన్ ప్రయాణ వివరాలు:

తేజస్ ఎక్స్ ప్రెస్ 82501, లక్నోలో ఉదయం 6:10గంటలకు బయల్దేరి గమ్యస్థానమైన ఢిల్లీకి మధ్యాహ్నాం 12:25గంటలకు చేరుకుంటుంది.

రైలు నంబర్ 82502 – తేజస్ ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రయాణం ప్రారంభించి గమ్యస్థానం లక్నో జంక్షన్ కు రాత్రి 10.05 గంటలకు చేరుకుంటుంది.

మొత్తం ప్రయాణం 6 గంటల 15 నిమిషాలలో పూర్తి చేస్తుంది. ఇది స్వర్న్ శతాబ్ది ట్రైన్ – ప్రస్తుతం ఈ రూట్ లో వేగంగా వెళ్లే రైలు కంటే చాలా తక్కువ. తేజస్ రైలు మంగళవారం మినహా మిగితా 6 రోజులు నడుస్తుంది.

తేజాస్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏసీ చైర్ కార్ ఉంటుంది.ఇందులో 56 సీట్లు, 9ఏసీ చైర్ కార్లు ఉంటాయి, ప్రతి కోచ్‌లో 78 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 758 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు.

లక్నో నుంచి డిల్లీ వచ్చే తేజస్ లో చైర్ కార్ టికెట్టు ధర – రూ.1,125, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏసీ చైర్ కార్ టికెట్టు ధర రూ.2,310. న్యూ ఢిల్లీ నుంచి లక్నో వెళ్లే తేజస్ లో చైర్ కార్ టికెట్టు ధర – రూ.1,280, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏసీ చైర్ కార్ టికెట్టు ధర రూ.2,450.

ప్రయాణికులు ప్రతి టికెట్ పైన కాంబో మీల్ (భోజనం) ఎంచుకోవచ్చు. టీ, కాఫీ లతో పాటు బిస్కెట్లు కూడా ట్రైన్ ఎక్కిన వెంటనే అందిస్తారు. నింబూ పాని, ఫ్లవరడ్ లస్సీ వంటివి కూడా ఎంచుకోవచ్చు. అల్పాహారానికి వెజిటేబల్ కట్లెట్, పోహ, ఉతప్పం, మేదు వడ, ఉప్మా వంటి వాటిలో ఎదోఒకటి ఎంచుకోవచ్చు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆంలెట్, కార్న్ ఫ్లేక్స్ వంటివి కూడా అందిస్తున్నారు తేజస్ ట్రైన్ లో. ప్రయాణం చివరలో, సమోసాలు, కాఫీ, టీ కూడా అందిస్తారు.

వేగంతో పాటు సౌకర్యం సౌలభ్యం అందిస్తున్న తేజస్ ఈరోజు ప్రారంభమైంది. దీనితో రైలు ప్రయాణంలో ప్రైవేటు శకం మొదలయ్యిందనే చెప్పాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.