హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ టెస్టింగ్‌లను ఆపేస్తున్నాము: డబ్ల్యూహెచ్వో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 6:15 AM GMT
హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ టెస్టింగ్‌లను ఆపేస్తున్నాము: డబ్ల్యూహెచ్వో

కోవిద్-19 ట్రీట్మెంట్ కోసం మలేరియా కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వాడాలని చాలా సార్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ప్రెస్ మీట్ లో కూడా చాలా సార్లు హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రస్తావనను తీసుకుని వచ్చారు డొనాల్డ్ ట్రంప్. హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోమవారం నాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఛీఫ్ టెడ్రోస్ అధానం గీబ్రెయేసుస్ సోమవారం నాడు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. ఇటీవల నిర్వయించిన రీసర్చ్ లలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ద్వారా ఇచ్చిన ట్రీట్మెంట్ లలో చాలా మంది చనిపోయారని.. దీంతో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వడాన్ని తాత్కాలికంగా ఆపివేయాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు.

ట్రయల్స్ లో భాగంగా చాలా దేశాలు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగిస్తూ ఉన్నాయని.. తక్షణమే ఈ పనిని ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి చాలా దేశాలు వీలైనన్ని మార్గాల్లో ట్రీట్మెంట్ ను ఇస్తూ ఉన్నారు. అందులో హైడ్రాక్సీక్లోరోక్విన్ ద్వారా ఇచ్చే చికిత్స కూడా ఒకటి. మరణాల రేటు అధికంగా ఉందని రీసర్చ్ పేపర్స్ లో ఇటీవల వెల్లడించారు.. దీంతో కొద్దిరోజుల పాటూ ఈ క్లినికల్ ట్రయల్స్ ను ఆపుదామంటూ ఆయన చెప్పుకొచ్చారు. మిగిలిన పరిశోధనలు జరుగుతూ ఉంటాయని అన్నారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఆర్థరైటిస్ కు ఉపయోగిస్తారు. కానీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతూ ఉండడం.. నేను కూడా అదే తీసుకుంటూ ఉన్నాను అని బహిరంగంగా అనడంతో.. హైడ్రాక్సీక్లోరోక్విన్ ను చాలా మంది కొంటూ ఉన్నారు. బ్రెజిల్ హెల్త్ మినిస్టర్ కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ ను కోవిద్-19 ట్రీట్మెంట్ లో భాగంగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. కానీ లాన్సెస్ జర్నల్ స్టడీ మాత్రం హైడ్రాక్సీక్లోరోక్విన్, యాంటీ మలేరియల్ క్లోరోక్విన్ డ్రగ్స్ ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిపారు.

Next Story