ఐటీ బూమ్.. రాబోయే నెలల్లో మ‌రిన్ని ఉద్యోగాలు

Recruitment trends India strongest hub for hiring IT & Tech Talent.కరోనా మహమ్మారి ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 April 2022 6:46 AM GMT
ఐటీ బూమ్.. రాబోయే నెలల్లో మ‌రిన్ని ఉద్యోగాలు

కరోనా మహమ్మారి ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా టెక్ కంపెనీలపై కూడా ఊహించని ప్రభావం చూపింది. ఇక ఇలాంటి సమయాల్లో వర్క్ ఫ్రమ్ హోం వైపు ఉద్యోగులు మొగ్గు చూపించారు. ఇంటి నుండి పని అనేది అతి సాధారణమైనదిగా, సౌకర్యవంతమైన పనిగా భావిస్తూ ఉన్నారు. ఓ వైపు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వరుసగా రాజీనామాలు చేస్తూ వస్తున్నారు, కొన్ని దేశాల్లో ఏకంగా మూకుమ్మడి రాజీనామాలు కూడా జరిగాయి. అటువంటి ట్రెండ్ ఉన్నప్పటికీ.. పరిశ్రమలలో, ప్రత్యేకించి IT సెక్టార్‌లో నియామకాల పరంగా మాత్రం విపరీతమైన పెరుగుదల కనిపించింది.

మ్యాన్‌పవర్‌గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే 2022 ప్రకారం "డిజిటల్ రోల్స్ కు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది.. IT & టెక్నాలజీ ఫీల్డ్ లో బలమైన పెరుగుదల (+40%) నివేదించింది. ఇక బ్యాంకింగ్ (+31%), ఆ తర్వాత తయారీ Manufacturing (+31%) ఉన్నాయి." ఆసక్తికరంగా IT, టెక్, మీడియాకు మంచి లాభదాయకంగా మారింది. భారతదేశం నుండి బలమైన ప్రాంతీయ నియామక అవకాశాలు(regional hiring prospects) 38%గా నివేదించబడ్డాయి. భారత్ తర్వాత చైనా, ఆస్ట్రేలియాలో హైరింగ్ ట్రెండ్ పాజిటివ్ గా ఉంది.


కెనడాకు చెందిన IT రిక్రూట్‌మెంట్ కంపెనీ అయిన TechDoQuest సంస్థ CEO శివ బిక్కిన మాట్లాడుతూ "మేము పెద్ద IT & టెక్ కంపెనీల నుండి ఉన్నట్లుండి పెరుగుతున్న అవసరాలను చూస్తున్నాము. ఈ నియామకాల సీజన్‌లో పే ప్యాకేజీలు, ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టడం జరిగింది." అని అన్నారు.

కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులను హెచ్.ఆర్. లు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో HRలు గమనించే సాధారణ పోకడలు, ఎ) సౌకర్యవంతమైన పని ఎంపికల కోసం డిమాండ్; బి) ఉద్యోగి వెల్నెస్ లేదా కేర్ ప్యాకేజీలు; సి) నైపుణ్యం లేదా అంతర్గత మొబిలిటీ అవకాశాలు. ఈ పోకడలు, సంస్థలను ముందుకు తీసుకుని వెళ్ళడానికి, వారి విధానాలను అనువైనవిగా మార్చడానికి మాత్రమే కాకుండా, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టిని తిరిగి పెట్టేలా చేస్తాయని శివ తెలిపారు.

చాలా కంపెనీలు తమ అవసరాలకు తగ్గ సమాచారాన్ని డిజిటల్ గా అందిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వర్చువల్ నియామక ప్రక్రియలలో పోస్ట్ చేస్తున్నాయి. స్కిల్ బేస్డ్ నియామక ప్రక్రియపై సంస్థలు దృష్టి పెట్టాయి. "ఐటి రిక్రూట్‌మెంట్ కంపెనీగా TDQ గత మూడు సంవత్సరాలుగా టాలెంట్ మేనేజ్‌మెంట్ నియామకాలలో వేగవంతమైన మార్పులను చూస్తోంది. టెక్ కంపెనీలలో సరైన వనరులను ఉంచడమే కాకుండా, అభ్యర్థుల అవసరాలు ఎలా వేగంగా మారుతున్నాయో కూడా మేము వారికి తెలియజేస్తాము" అని శివ చెప్పారు.


IT & ఇంజినీరింగ్ రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న సాంకేతిక నైపుణ్యాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (AI & ML) అని TDQ సర్వే వెల్లడించింది. అయితే నాన్-టెక్నికల్ వైపు ప్రాబ్లెమ్-సాల్వింగ్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్, వంటివి ఉన్నాయి.

MonoSol, Facebook, Google, Twitter, Square వంటి టెక్ దిగ్గజాలు కూడా వర్క్ కల్చర్ లో భాగంగా వచ్చిన మార్పులను స్వీకరిస్తూ ఉన్నాయి. అవసరానికి తగ్గట్టుగా అభ్యర్థుల నియామక ప్రక్రియ, ఉద్యోగుల నిర్వహణను తిరిగి మూల్యాంకనం చేయడం ద్వారా తమ బృందాలను విజయవంతంగా నడిపించాయి. సర్వేలో పాల్గొన్న 3090 మంది యజమానులలో 55% మంది రాబోయే నెలల్లో మరింత మందిని నియమించుకోవడం జరుగుతుందని చెప్పారు. భారతదేశం IT, అత్యుత్తమ సాంకేతిక ప్రతిభకు ప్రధాన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది.

Next Story