మీరూ ఐటీఆర్ ఫైల్ చేస్తారా?.. అయితే ఇది మీ కోసమే
2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 15.87 శాతం పెరిగింది.
By అంజి Published on 11 July 2023 1:53 PM ISTమీరూ ఐటీఆర్ ఫైల్ చేస్తారా?.. అయితే ఇది మీ కోసమే
2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 15.87 శాతం పెరిగింది. రూ.4.75 లక్షల కోట్లకు చేరుకుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఫైనాన్స్ మినిస్టరీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. స్థూల వసూళ్లు రూ.5.17 లక్షలు కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో స్థూల వసూళ్లతో పోలిస్తే ఇది 14.65 శాతం ఎక్కువగా ఉంది. ఈ గణాంకాలను చూస్తుంటే దేశ ఎకనామీ యాక్టివిటీస్ పెరిగిందని ఇట్టే స్పష్టం అవుతోంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో 2023 -24 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇప్పటి వరకు డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్.. మొత్తం బడ్జెట్ అంచనాల్లో 26.05 శాతానికి చేరుకుందని తెలిపింది. ఇందులో ఆదాయపు పన్నుతో పాటు కంపెనీ పన్నులు కూడా ఉన్నాయి. ట్యాక్స్ రీఫండ్ తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ.4.75 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే టైంలో వచ్చిన నికర పన్ను వసూళ్లతో పోలిస్తే ఇది 15.87 శాతం ఎక్కువ. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి జూలై 9వ తేదీ వరకు రూ.42 వేల కోట్ల రిఫండ్‌లు జారీ అయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయంలో వచ్చిన పన్ను వాపసు కంటే ఇది 2.55 శాతం ఎక్కువ.
ప్రత్యక్ష పన్ను వసూళ్ల శాతం పెరిగి రూ.5.17 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2023-2024 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా రూ.18.23 కోట్లగా ఉండవచ్చని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.16.61 కోట్ల కంటే 9.75 శాతం ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్ల గణాంకాలు నికర వసూళ్లు రూ. 16.61 లక్షల కోట్లు. గత ఫైనాన్షియల్ ఇయర్ రూ.14.12 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 17.63 శాతం ఎక్కువ అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.