వైజాగ్‌లో టీమిండియా ఓపెన‌ర్ల వీరంగం.. స్కోరెంతంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Dec 2019 4:50 PM IST
వైజాగ్‌లో టీమిండియా ఓపెన‌ర్ల వీరంగం.. స్కోరెంతంటే..?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండ‌వ‌ వన్డేలో టీమిండియా భారీస్కోరు దిశ‌గా ప‌య‌నిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు.

విండీస్ బౌలర్లను ఓ రేంజ్‌లో ఆడుకున్న రోహిత్, రాహుల్‌ల‌ జోడి పరుగుల వరదపారించారు. అయితే అల్జరీ జోసెఫ్ వేసిన 37వ ఓవర్‌లో బౌండరీతో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్(102) ఆదే ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విండీస్ కెప్టెన్ పొలార్డ్ వేసిన ఓవర్‌లో టీమిండియా సార‌ధి కోహ్లీ(0) డకౌట్ అయ్యాడు. అనంత‌రం 43వ ఓవ‌ర్లో మ‌రో ఓపెన‌ర్ రోహిత్(159) కాట్రెల్ బౌలింగ్‌లో కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిష‌బ్ పంత్(1), శ్రేయస్ అయ్యర్(20) ఉన్నారు.

Next Story