చెల‌రేగి ఆడుతున్న టీమిండియా ఓపెన‌ర్లు.. స్కోరెంతంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Dec 2019 7:58 PM IST
చెల‌రేగి ఆడుతున్న టీమిండియా ఓపెన‌ర్లు.. స్కోరెంతంటే..

ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియా, విండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 కొద్దిసేప‌లి క్రిత‌మే ప్రారంభ‌మ‌య్యింది. టాస్ గెలిచిన విండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భార‌త ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఓపెన‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. వీరిద్ద‌రి విజృంభ‌న‌తో భార‌త్ స్కోరు 8వ ఓవ‌ర్ల‌నే 100 ప‌రుగులు దాటింది. సిక్సులు, ఫోర్ల‌తో చెల‌రేగిపోయారు.

ఓపెనర్ రోహిత్ శర్మ 22 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో అర్థ‌సెంచ‌రీ పూర్తి చేసుకోగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 30 బంతుల్లో రెండు సిక్స్లు, ఆరు ఫోర్ల సాయంతో అర్థ‌సెంచ‌రీ పూర్తి చేశాడు. టీమిండియా స్కోరు ప్ర‌స్తుతం 10 ఓవ‌ర్ల‌కు వికెట్లేమి కోల్పోకుండా 116 ప‌రుగులు చేసింది.

Next Story