టీడీపీ, వైసీపీలపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఫైర్
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Sept 2019 6:13 PM ISTహైదరాబాద్: 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీని టీడీపీ, వైసీపీలు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి .టీడీపీ పాలనలాగానే వైసీపీ పాలన ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను రౌడీగా ప్రసన్న కుమార్ వర్ణించడాన్ని విష్ణువర్దన్ రెడ్డి దుయ్యబట్టారు.
కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కేబినెట్లో పనిచేసిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. కన్నా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేశారు. ఆయన స్థాయిని మరిచి విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ లాలూచీ, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.
Next Story