ఇంట్లో జారి పడ్డ టీడీపీ నాయకురాలు నన్నపనేని.. తలకు గాయం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 26 Sept 2020 2:47 PM IST

ఇంట్లో జారి పడ్డ టీడీపీ నాయకురాలు నన్నపనేని.. తలకు గాయం

టీడీపీ సీనియర్‌ మహిళా నేత, ఏపీ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి గాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఆమె ఇంటిలో కాలుజారి పడ్డారు. దీంతో ఆమె తలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చెకప్‌ తరువాత ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు.

విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు ఆమె ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఆరా తీస్తున్నారు. వయోభారం కారణంగా ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతికే పరిమితమవుతున్న రాజకుమారి ఒకప్పుడు టీడీపీలో ఫైర్‌ బ్రాండ్‌ నేతగా పేరుతెచ్చుకున్నారు. టీడీపీ హయాంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన రాజకుమారి.. వైసీపీ ప్రభుత్వం రాక తర్వాత పదవి నుంచి తప్పుకున్నారు.

Next Story