అమరావతి: చారిత్రాత్మక అయోధ్య తీర్పు నేపథ్యంలో తెలుగుదేశం పార్ట అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ‘అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి. చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయోధ్యలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసు విషయంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయోధ్య తీర్పుపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ స్పందించారు. అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్టర్‌ వేదికగా తెలిపారు. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Ys Jagan

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.