రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 16 Oct 2019 7:53 PM IST

అమరావతి: రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. పొలిట్ బ్యూరోలోకి కొత్తగా ముగ్గురిని తీసుకునేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎంపీ గల్లా జయదేవ్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు టీడీపీ పొలిట్ బ్యూరోలో చేరనున్నారు. సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీలపై పొలిట్ బ్యూరో చర్చించనుంది. మాజీ స్పీకర్ కోడెల , పడవ ప్రమాద మృతులకు పొలిట్ బ్యూరో సభ్యులు సంతాపం తెలపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సమాయత్తంపై చర్చించనున్నారు. దీనితో పాటు 13 అంశాలపై టీడీపీ పొలిట్ బ్యూరో చర్చించనుంది.
Next Story