అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని రాజధానిని చంద్రబాబు అమరావతికి తీసుకొచ్చారని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. టీడీపీ నేతలు రాజధానిలో పర్యటించారు. ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ మాట్లాడారు. అన్ని జిల్లాలకు అనుకూలంగా ఉంటుందని అమరావతిని రాజధానిగా నిర్ణయించారని తెలిపారు.

నదీ పరీవాహక ప్రాంతంలో రాజధానిని కడితే చాలా సుందరమైఔన సిటీ అవుతుందన్నారు. చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీతోనే ఫండ్స్‌ వచ్చాయని గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రావాలసిన నిధులు వెనక్కిపోయాయి. రాష్ట్రానికి అప్పు ఇస్తామన్న వాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోయారని గల్లా జయదేవ్‌ విమర్శించారు.

చంద్రబాబు భవిష్యత్తు కార్యాచరణను నమ్మి రైతులు 35 వేల ఎకరాల భూమి ఇచ్చారు. రాజధాని రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ఐఎఎస్‌ క్వార్టర్ల నిర్మాణం లక్షా యాభైవేల చదరపు గజాల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. సీఎం జగన్‌ రాజధాని నిర్మాణం విషయంలో అమరావతి పేరు అసలు పలకలేదన్నారు. జగన్‌కి రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి అవసరం అని తెలియదా..? అంటూ గల్లా జయదేవ్‌ ప్రశ్నించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.