మూడు ముక్కలాటతో సగం చచ్చారు..చంద్రబాబును అడ్డుకుని పూర్తిగా..
By రాణి Published on 27 Feb 2020 2:49 PM IST
విశాఖలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరేందుకు కిరాయి మనుషుల్ని తీసుకొచ్చారని ఆరోపించారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి కోడిగుడ్లు విసిరేందుకు తీసుకొచ్చారని, పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబుపై కోడిగుడ్ల దాడి చేయించారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయన్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడిపై దాడి చేయడం చాలా హేయమైన చర్య అన్నారు. రాష్ర్ట భవిష్యత్ ను తలచుకుంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారంటూ వాపోయారాయన.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సినిమాకు జగన్ ఈరోజు చూపించింది ట్రైలర్ మాత్రమేనని..మున్ముందు విశాఖ ప్రజలకు అసలు సినిమా చూపిస్తాడని విమర్శించారు. ట్రైలరే ఇలా ఉంటే..సినిమా ఇంకెలా ఉంటుందో ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలని విన్నవించారు. 10 రోజుల ముందే చంద్రబాబు తన పర్యటన గురించి ప్రకటించినా..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా..బాబును అడ్డుకుంటామని మంత్రులే స్వయంగా చెప్తే..వారినెందుకు అరెస్ట్ చేయలేదని వర్లరామయ్య ప్రశ్నించారు.
కాగా..చంద్రబాబు పై కోడిగుడ్లు టమాటాలు విసరాలి. మనిషికి రూ.500 పదండి..అంటూ మహిళలను ఆటోల్లో తరలిస్తున్న దృశ్యాలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశాఖలో చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
''మూడు ముక్కలాట మొదలు పెట్టి సగం చచ్చారు. ప్రతిపక్ష నేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారు. వైకాపా డిఎన్ఏ లో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖ లో బయటపడ్డాయి.
@ysjagan గారు విశాఖలో అడుగుపెడితే ఉత్తరాంధ్ర లో అరాచకం ఏ రేంజ్ లో ఉంటుందో వైకాపా ఈ రోజు ట్రైలర్ చూపించింది.ప్రతిపక్ష నేత పై ఈ రోజు గుడ్లు,టొమేటోలు రేపు ప్రజల పై బాంబులు,కత్తులతో దిగుతుంది వైకాపా రౌడీ బ్యాచ్'' అంటూ విమర్శలు చేశారు.