సినీ నటులను విమర్శిస్తూ ఓ ఎంపీ చేసిన ట్వీట్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయ సాయిరెడ్డి సినీ నటులను ఘోరంగా అవమానిస్తూ ట్వీట్ చేయడాన్ని ఆయన ఖండించారు. గోస్ట్ రైటర్ రాస్తే, పేరు పెట్టుకోవడం సినిమా నటులకు తెలిసిన విద్యేనంటూ తక్కువ చేసి మాట్లాడుతారా అని బుద్ధా ప్రశ్నించారు. సినీ రంగంలో నటులు పడే కష్టం విలువ అడ్డంగా ఎదిగిన వారికి ఏం తెలుస్తుందని విమర్శించారు. సినీ నటులను, వారి కళను అవహేళన చేస్తూ విజయసాయి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. జనసేన మాజీ నేత రాజా రవితేజ చెప్పిన అంతఃపుర రహస్యాలు అందరికే తెలిసినవే. దత్త పుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాశాడంటే ఎవరూ నమ్మలేదని.. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యేనని వ్యాఖ్యానించారు. స్పీచ్ లు, సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్‌లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదని విజయసాయి రెడ్డి ట్వీట్టర్ లో రాశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.