చెట్టుని ఢీ కొట్టిన సుమో.. రూ. 9,500 జరిమానా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Dec 2019 1:06 PM ISTసిద్దిపేట : సిద్ధిపేట పట్టణంలో ఉన్న వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో అది పడిపోయింది. ఈ ఘటనను గమనించిన సమీపంలో ఉన్న పోలీసులు హరితహారం అధికారి ఐలయ్య కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న ఐలయ్య వాహన దారుడు రాకేష్ కి రూ.9500 జరిమానా విధించారు. హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ శాఖ ఉన్నత అధికారులు అందరికి , మున్సిపల్ చైర్మన్ కి, కౌన్సిలర్ల కు, మున్సిపల్ కమిషనర్ కి, డీఈ కి, హరితహారం అధికారి సామల్ల ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.