పేలిన ట్యాంకర్.. 19 మంది మృతి.. 190 మందికి గాయాలు

By సుభాష్  Published on  14 Jun 2020 12:45 PM GMT
పేలిన ట్యాంకర్.. 19 మంది మృతి.. 190 మందికి గాయాలు

ఒక వైపు చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండగా, బెజియాంగ్‌ ప్రావిన్స్‌ లోని వెన్లింగ్‌ పట్టణంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ చమురు ట్యాంకర్ పేలి 19 మంది మృతి చెందారు. మరో 190 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇరువైపులా పెద్ద పెద్ద భవనాలు, వర్క్‌ షాపులున్నాయి. ట్రక్కు పేలుడుకు భవనాలన్నీ కుప్పకూలాయి. ఇది చదవండి: రెస్టారెంట్‌ యజమానులకు 723 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

భవనాలన్నీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ట్యాంకర్ లిక్విఫైడ్‌ గ్యాస్‌ తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా పేలుడు జరగడంతో ఆ ప్రాంతం అగ్నిగోళంగా మారిందని అధికారులు తెలిపారు. గాయాలైన వారిని రక్షించేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది సైతం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుపై దర్యాప్తు చేపట్టారు. ఇది చదవండి: దుండగుడి కాల్పులు.. మాజీ ఎంపీ సహా 8 మంది మృతి

Next Story