రెస్టారెంట్‌ యజమానులకు 723 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

By సుభాష్  Published on  13 Jun 2020 1:31 PM GMT
రెస్టారెంట్‌ యజమానులకు 723 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

అప్పుడప్పుడు కొన్ని కేసుల్లో విచిత్రమైన శిక్షలు విధిస్తుంటుంది కోర్టు. కోర్టును ఎవరికైన జైలు శిక్ష విధిస్తే పది, ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంటాయి. ఈ దేశంలో ఇద్దరికి వందలాది సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. థాయ్‌లాండ్‌ రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సీఎన్‌ఎన్‌ వార్త కథనం మేరకు.. 2019లో అపికార్ట్‌ బోవోర్బంచారక్‌, ప్రపాసార్న్‌ బోవోర్బాన్‌ రెస్టారెంట్లు తమ వినియోగదారులకు ఓ అద్భుతమైన ఆఫర్‌ అంటూ భారీ ఎత్తున డిస్కాంట్‌ వోచర్లను అందజేశారు.

ఇక సీ ఫుడ్‌ అంటే అధికంగా ఇష్టపడే థాయ్‌లాండ్‌ వాసులు ఆ వోచర్లను కొనుగోలు చేశారు. ఇక వోచర్లను తీసుకుని రెస్టారెంట్లకు వెళితే .. యజమానులు చేతులెత్తేశారు. వోచర్లు చెల్లవంటూ తేల్చ చెప్పడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆగ్రహంతో కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే ఏడాది సెప్టెంబర్‌లో రెండు రెస్టారెంట్ల యజమానులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక అప్పటి నుంచి కోర్టు విచారణ కొనసాగుతుండగా, నేడు తీర్పునిచ్చింది.

ముందుగా వారికి 1446 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితేతాము చేసింది తప్పేనంటూ రెస్టారెంట్ల యజమానులు ఒప్పుకోవడంతో వారి శిక్షను సగానికి అంటే 723 సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. అలాగే రూ.58,500 డాలర్ల జరిమానా కూడా విధించింది. కాగా, థాయ్‌లాండ్‌ చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి 20 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం బయటకు రావచ్చు.

Next Story