దేశంలో కరోనా వల్ల లాక్‌డౌన్‌ కారణంగా అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. మద్యం లేక మందుబాబులు నానా అవస్థలకు గురయ్యారు. మద్యం షాపులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ నిద్రలేని రాత్రులు గడిపారు. కరోనా మహమ్మారి వల్ల మందు బాబులకు శాపంగా మారింది. ఇక దేశంలో మూడో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకోగా, మరి కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా డోర్‌ డెలివరి చేసేందుకు అనుమతులు ఇచ్చాయి.

ఏపీలో కూడా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్రం చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉండటంతో తమిళ మద్యం ప్రియులు ఏపీ బాట పట్టారు. వేలాదిగా సరిహద్దు దాటి ఏపీలో ఉన్న మద్యం షాపుల మూందు క్యూలు కట్టారు. తమిళనాడుకు చెందిన మద్యం బాబులు బారులు తీరడం చూస్తే ఆశ్చర్చపోక తప్పదు. పాలసముద్రం మండలంలోని బలిజకండ్రిగ, గంగమాంబపురం మద్యం షాపుల వద్ద సరిహద్దు దాటి కుప్పలు తెప్పలుగా తరలివచ్చారు. మద్యం షాపు నుంచి కిలోమీటర్ల మేర గొడుగులు పట్టుకుని మండుటెండల్లో మద్యం కోసం బారులు తీరారు. వీరి క్యూను చూస్తేంటే మద్యం కోసం ఇంత బానిస అయ్యారా అని ఆశ్యర్యపోతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *