ఇదే చివరి వీడియో అంటూ.. నటి ఆత్మహత్యాయత్నం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 10:25 AM IST
ఇదే చివరి వీడియో అంటూ.. నటి ఆత్మహత్యాయత్నం

Tamil actress Vijaya Lakshmi attempts suicide వేదింపులకు తాళలేక తమిళ నటి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఇద్దరు గత నాలుగు నెలలుగా వేదిస్తున్నారని, వారి వేదింపులను ఇక తట్టుకోలేనని.. తన చావుతోనైనా సమాజంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన అనంతరం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తమిళ నటి విజయలక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆత్మహత్యకు యత్నించే ముందు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఇదే తన చివరి వీడియో అంటూ పేర్కొంది. నామ్ తమిళర్ కచ్చి పార్టీ లీడర్ సీమాన్ అలాగే హరి నడర్ కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ వీడియోలో స్పష్టం చేసింది విజయలక్ష్మి.

ఆ వీడియోలో ఏం ఉందంటే.. గత నాలుగు నెలలుగా సీమాన్, హరి నడర్ చేస్తున్న పనుల కారణంగా నేను ఒత్తిడికి గురవుతున్నాను. నా కుటుంబాన్ని కాపాడుకోడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశాను. అయితే.. తమకు ఉన్న పలుకుబడితో వారు మీడియాలో నాపై దృష్ప్రచారం చేస్తున్నారు. నా మరణంతోనైనా సమాజంలో మార్పు కలగాలి. ఇక మరికాసేపట్లో నా బీపీ పడిపోతుంది.. నేను చనిపోతాను.. వారిని మాత్రం వదిలిపెట్టకండి అని ఆ వీడియోలో తెలిపింది.

నామ్ తమిళర్ కచ్చి అనేది ఓ జాతీయ పార్టీ. ఆ పార్టీ నాయడుకే సీమన్. అలాగే హరి నడర్ కూడా రాజకీయ నాయకుడే. అయితే ఈ ఇద్దరు ఆమెను ఎందుకు వేధిస్తున్నారు అనేది తెలియదు కానీ వీరి కారణంగానే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం నటి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది.

Next Story