అందాలను నేలపై పరిచిన అవంతికా..
By తోట వంశీ కుమార్ Published on 25 April 2020 4:52 PM GMT
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో సినీనటులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్‌లో తాము చేసే పనులను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక హీరోయిన్లు హాట్ హాట్ ఫోటోలతో లాక్‌డౌన్‌లో హీట్ పెంచేస్తున్నారు. ప్రస్తుతం క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్ వైరల్ అవుతోంది. చాలా మంది హీరోయిన్లు పిల్లో లేదా పిల్లో మాదిరిగా ఉండే డ్రెస్ వేసుకుని వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ వేరే వారికి చాలెంజ్ విసురుతున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఈ చాలెంజ్ ను ఇటీవలే పూర్తిచేసింది. ఈ చాలెంజ్‌తో పాటు పేపర్ డ్రెస్ వేసుకుని మరో కొత్త చాలెంజ్‌కు తెరతీసింది.
తాజాగా ఈ చాలెంజ్‌ను మిల్కీ బ్యూటీ చాలెంజ్‌ను పార్టిసిపేట్ రేసింది. ఒంటిమీద కేవలం దిండు పెట్టుకుని కిందపడుకుని ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. వలువలు వలిచి.. అందాలను నేలపై పరిచి.. తెల్లని దిండుతో కప్పుకున్నట్లు ఈ ఫోటోలో ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరు పెట్టే హాట్ ఫోటోలతో కుర్రకారుకి నిద్ర కరువైంది. మరి రానున్న రోజుల్లో పిల్లో చాలెంజ్‌లో ఏ భామ పాల్గొంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.