టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న 'నిన్నే పెళ్లాడతా'..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 9:26 AM GMT
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న నిన్నే పెళ్లాడతా..

ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్), సిద్ధిక హీరో హీరోయిన్లుగా వైకుంఠ బోను దర్శకత్వంలో బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మంచి కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రమిది. హీరోహీరోయిన్లులతో పాటు సాయికుమార్, సీత, ఇంద్రజల నటన ఈ చిత్రంలో హైలెట్ గా వుంటుంది. మంచి ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది మా చిత్రం. రెండు పాటలు, రెండు ఫైట్స్ మినహా టాకీ మొత్తం పూర్తయ్యింది. డిసెంబరు ఎండింగ్ లో సినిమా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

Next Story
Share it