తైవాన్ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
By తోట వంశీ కుమార్Published on : 31 July 2020 4:14 PM IST

తైవాన్ ప్రజాస్వామ్య ఉద్యమ పితామహుడు, మాజీ అధ్యక్షుడు లీ టెంగ్ హుయి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హృద్రోగ సంబంధ సమస్యలు, అవయవాలు పని చేయలేకపోవడంతో బాధపడుతున్న ఆయన గత ఫిబ్రవరి నుంచి తైపీ వెటరన్స్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 97 సంవత్సరాలు.
Also Read
చైనా వైఖరిలో ఈ మార్పు ఏమిటో..!గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో 7.30గంటల సమయంలో ఆయన మరణించినట్లు ఆయన ప్రతినిధులు తెలిపారు. తైవాన్‌కు చైనాకు సంబంధం లేకుండా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తైవాన్‌లో ప్రత్యక్ష ఎన్నికలతో పాటు ఇతర ప్రజాతంత్ర మార్పులు తీసుకువచ్చిన సంస్కర్త. ఆయన మృతి పట్ల ప్రస్తుత అధ్యక్షుడు సాయ్ ఇంగ్-వెన్ సంతాపం తెలియజేశారు.
Next Story