ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడేపల్లి హైవేపై ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, తాడేపల్లి సమీపంలో రోడ్డు పక్కన లారీకి డ్రైవర్‌, క్లీనర్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో ఓ ఆటో అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌తోపాటు ఆటోలో ఉన్న ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం వల్ల రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇతర వాహనాలకు అటంకం ఏర్పడింది. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.