ఆ రోజును భారతీయులు మరిచిపోలేరు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Sep 2019 9:30 AM GMT
ముంబై: అది ఫస్ట్ టీ20 వరల్డ్ కప్. హేమాహేమీ జట్లు రంగంలోకి దిగాయి. భారత్ కుర్రాళ్లతో సై అంది. మిస్టర్ కూల్ ధోని భారత్ కెప్టెన్. దక్షిణాఫ్రికాలో మొదటి టీ20 వరల్డ్ కప్ జరిగింది. భారత్ బరిలోకి దిగేటప్పుడు ఏమాత్రం అంచనాలు లేవు. ఎందుకంటే..ఈ టోర్నీకి ముందు టీమిండియా ఆడింది..ఒకే ఒక్క టీ20. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా అప్పటికే చాలా మ్యాచ్‌లాడాయి. అంతేకాదు..టోర్నీ పేవరేట్‌గా బరిలోకి దిగాయి. కాని..ఫైనల్ ఆడింది మాత్రం రెండు ఆసియా సింహాలు భారత్ - పాకిస్తాన్. ఫైనల్లో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టీ మీండియా మొదట బ్యాటింగ్ చేసి 5 వికెట్లకు 157 పరుగులు చేస్తే..పాకిస్తాన్ విజయం ముందు బొక్కబోర్లా పడింది.
158 పరుగుల లక్ష్యంతో పాక్ రంగంలోకి దిగింది. భారత భౌలర్ల ధాటికి పాక్ వరుసుగా వికెట్లు కోల్పోయింది. మిస్బా - ఉల్ - హక్ మాత్రం క్రీజ్‌ను అంటిపెట్టుకుని ఉన్నాడు. పాక్‌కు విజయంపై ఆశలు మాత్రం చావలేదు. చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాలి. క్రీజ్‌లో మిస్బా. అందరూ పాక్‌దే విజయం అనుకున్నారు. కాని..ధోనీ తన కెప్టెన్ మార్క్ చూపించాడు. అంతర్జాతీ క్రికెట్‌లో ఏమాత్రం అనుభంలేని జోగిందర్ సింగ్‌కు బాల్ ఇచ్చాడు. మొదటి బంతినే మిస్బా సిక్స్ బాదాడు. భారత అభిమానుల్లో ఆందోళన.
అందరూ ఓడిపోయిందనే అనుకున్నారు. కాని..రెండో బాల్ స్కూప్ ఆడబోయి..షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న శ్రీశాంత్‌కు మిస్బా దొరికాడు. అంతే..భారత శిబిరంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇండియా 5 పరుగుల తేడాతో మొదటి టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.