బాహుబలి తరువాత టాలీవుడ్‌లో అంతటి సినిమా సైరా నరసింహరెడ్డి అంటున్నారు సినీ క్రిటిక్స్. వారు అంటున్నట్లే తాజాగా విడుదలైన సైరా నరసింహరెడ్డి ట్రైలర్ చిరు అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌ ఒక్కసారి సినిమా అంచనాలను పెంచిందనే చెప్పాలి. చారిత్రక , భారీ చిత్రం విజయం సాధిస్తుందంటున్నారు మెగాస్టార్ అభిమానులు.

1857 కంటే ముందే తెలుగు గడ్డ మీద ఓ వీరుడి నేతృత్వంలో స్వాతంత్ర్య సంగ్రామం జరిగింది. అదే ఉయ్యాలవాడ నరసింహరెడ్డి తెల్ల దొరలపై సాగించిన సమరం. సైరా నరసింహరెడ్డి సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గాంధీ జయంతి అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సైరా నరసింహరెడ్డి టీజర్ మెగా అభిమానుల్లో వేడి పెంచింది.

ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమాను చిరు కుటుంబం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధమవుతుంది. ట్రైలర్‌లో ఆనాటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ” నరసింహరెడ్డి సామాన్యుడు కాదు..కారణజన్ముడంటూ ట్రైలర్ మొదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ భూమ్మీద పుట్టింది మేము..ఈ మట్టిలో కలిసేది మేము..మీకెందుకు కట్టాలి శిస్తు అంటూ చిరు పలికే మాటలు థియేటర్లలో ఈలలు మోగించడం ఖాయం.

సైరా నరసింహరెడ్డి మూవీలో హీరోయిన్ నయనతార..ఇంకా అమితాబ్ బచ్చన్, సుదీప్ , జగపతిబాబు, తమన్నాలు నటిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.