అమెరికాలో సైరా సంచ‌ల‌నం.. చిరు అభిమానులు ఏం చేసారో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 7:12 AM GMT
అమెరికాలో సైరా సంచ‌ల‌నం.. చిరు అభిమానులు ఏం చేసారో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సంచ‌ల‌న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ఈ నెల 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే... గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మెగా మూవీపై హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పవచ్చు. ముఖ్యంగా యూఎస్ లో మెగా అభిమానులు సైరా రిలీజ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఒక పిక్ నెటిజన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.

పార్కింగ్ దగ్గర కార్లతో సైరా టైటిల్ ని తెలుగులో ఎట్రాక్టివ్ గా సెటప్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. దీన్ని బట్టి సైరా ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ గడ్డ పై ఖరీదైన కార్లతో తెలుగు సినిమా తెలుగు అక్షరాలు ఇలా కనిపిస్తున్న విధానం ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. మ‌రి.. ఎన్నో అంచ‌నాల‌తో వ‌స్తున్న సైరా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

Next Story
Share it