'సైరా' గురించి కామెంట్ చేసిన రాజ‌శేఖ‌ర్.. ఇంత‌కీ ఏంటా కామెంట్..?

By Medi Samrat  Published on  11 Oct 2019 6:38 AM GMT
సైరా గురించి కామెంట్ చేసిన రాజ‌శేఖ‌ర్.. ఇంత‌కీ ఏంటా కామెంట్..?

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'సైరా' ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఈ శుభ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిరు 'సైరా' స‌క్సెస్ ను క‌ళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసారు. ఈ వేడుక‌లో డా. రాజ‌శేఖ‌ర్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్ చిరు గురించి, సైరా గురించి మాట్లాడుతూ... చిరంజీవి గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది.

ఇంత పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం ఉండాలి. హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్. చిరంజీవి గారు లేకుండా రామ్ చరణ్ లేరు. గొప్ప సినిమా తీసి తన తండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. తెలుగు వాళ్లందరూ గర్వంగా ఫీలయ్యే సినిమాలో యాక్ట్ చేసిన చిరంజీవికి హ్యాట్సాఫ్. ఇంత పెద్ద సినిమాను సురేందర్‌రెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన చాలా లక్కీ. చిరంజీవి గారూ.. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి.

డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు ఖర్చుపెట్టడం, ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా హ్యాట్సాఫ్ టు యు. అండ్ గ్రేట్. అందరూ ఈ వయసులో అని అంటున్నారు. సినిమా చూసినప్పుడు నాకు ఆయన వయసు కనిపించలేదు. ఆ స్పీడ్ అంతా ఎప్పటిలాగే అనిపించింది. తెలుగు వారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవి నిజంగా గ్రేట్ అంటూ చిరు పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు రాజ‌శేఖ‌ర్. ఇలాంటి కార్యక్రమం సుబ్బిరామిరెడ్డి మాత్రమే ఏర్పాటు చేయగలరు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు అన్నారు.

Next Story
Share it